Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Karoline Leavitt | ‘పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనండి’.. అమెరికా యువతకు కరోలిన్ లీవిట్ పిలుపు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందన్న ‘ఫ్యూ రిసెర్చ్ సెంటర్’ నివేదికపై స్పందిస్తూ, అమెరికా యువత పెళ్లిళ్లు చేసుకొని ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు.
క్రైస్తవాన్ని అధిగమించి 2035 కల్లా ఇస్లాం అతిపెద్ద మతంగా మారనుందని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది; కొందరు ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా, మరికొందరు జీవనవ్యయం పెరగడం వల్ల యువ కుటుంబాలు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని కామెంట్ చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Karoline Leavitt : రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందని ఇటీవల వచ్చిన ఓ నివేదికపై వైట్‌హౌస్ (White House) మాజీ ప్రెస్ సెక్రటరీ (Ex Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) స్పందించారు. ఈ నివేదిక నేపథ్యంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదలకు సంబంధించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిళ్లు చేసుకొని ఎక్కువ మంది పిల్లలను కనాలని అమెరికా యువత (American Youth) కు పిలుపునిచ్చారు.
క్రైస్తవాన్ని అధిగమించి 2035 కల్లా ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందని ‘ఫ్యూ రిసెర్చ్ సెంటర్ (Pew Research Center)’ అంచనా వేసింది. ఇస్లాం, క్రైస్తవం రెండు మతాల్లో జనాభా పెరుగుతున్నప్పటికీ ముస్లింల జనాభా చాలా వేగంగా పెరుగుతున్నదని ఆమె చెప్పారు. దీనికి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన కథానాన్ని లీవిట్ ప్రస్తావించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని అమెరికా యువతను కోరారు. పిల్లలకు అమెరికాపట్ల ప్రేమను పెంపొందించాలని సూచించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)