Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
KCR ఫామ్‌హౌస్ భూముల లెక్కలన్నీ అసెంబ్లీలో బయటపెడ్తం: మంత్రి పొంగులేటి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సర్వే దాదాపు పూర్తయిందని మంత్రి పొంగులేటి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల లెక్కలన్నీ త్వరలో అసెంబ్లీ వేదికగా బయటపెడతామని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో సీకెంట్ పైల్స్ వాడటం వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని, కేసీఆర్ ప్రజాధనాన్ని వృథా చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఎర్రవల్లిల్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (నవంబర్ 21) మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పొంగులేటి మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల సర్వే ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల లెక్కలన్నీ త్వరలో అసెంబ్లీ వేదికగా బయటపెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల సర్వే ప్రారంభం కాగానే కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ భూమి విషయంలో కోర్టుకెళ్లి ముందస్తు స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూభారతి పోర్టల్ సాంకేతిక సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యాయని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్‌లో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తామని చెప్పి, ఎలాంటి అనుమతులు లేకుండా మూడు బ్యారేజీల్లోనూ సీకెంట్ పైల్స్ వాడారని మంత్రి పొంగులేటి అన్నారు. సీకెంట్ పైల్స్ వాడటం వల్లే బ్యారేజీలు కుంగిపోయాయని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తేనే బ్యారేజీలు నిలబడతాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ కాకుండా సీకెంట్ పైల్స్ ఎందుకు వాడారో కేసీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)