Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- BRS leader KCR extended Suddula Bathukamma greetings to women in Telangana. He praised their role in the state's formation and progress, and credited the former BRS government with implementing welfare schemes for them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
KCR : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలైన సద్దుల బతుకమ్మ ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొందన్నారు.
‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అని కోరుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వేడుకలను ఆడబిడ్డలు ముగిస్తారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సాధనలో, తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మహోన్నతమైనదని, వారి కృషిని త్యాగాలను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.