Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కేసీఆర్, కేటీఆర్‌కు ఎంపీ వంశీకృష్ణ బహిరంగ సవాల్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Guntur MP Gadda Vamsi Krishna challenged BRS leaders KCR and KTR to open the gates of the Kaleshwaram project, asserting its structural integrity and accusing the BRS government of corruption and mismanagement.
He also criticized Chief Minister KCR for the current drought and the state's debt, while highlighting his own efforts in development and employment initiatives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును సరైన పద్ధతిలోనే నిర్మించామని, అందులో ఎలాంటి లోపాలు లేవని బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉంటే వారు ధైర్యంగా ప్రాజెక్టు కింది భాగంలో నిలబడి గేట్లు ఓపెన్ చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై నమ్మకం ఉంటే తన డిమాండ్‌ను స్వీకరించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. మంగళవారం (నవంబర్ 10) ఎంపీ వంశీ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రస్తుత కరువు ఎల్ నినో తెచ్చింది కాదు కేసీఆర్ తెచ్చిన కరువని విమర్శించారు.
లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లగా రైతులకు మాత్రం చుక్క అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ధ్వంసమైందని మండిపడ్డారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని కోసం వృధా చేసి, ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణమని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)