Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై అధికారిక ప్రారంభానికి ముందే వాహనాల రాకపోకలు అనుమతించడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.
వైరా మండల పరిధిలోని హైవే ఎగ్జిట్ వద్ద జరిగిన కారు–లారీ ఢీకొన్న ఘటనలో హైదరాబాద్‌కు చెందిన దంపతులు మృతి చెందగా, వారి కుమారుడు గాయపడ్డాడు.
రహదారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ప్రయాణికులు వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, అత్యవసర వైద్య సేవలు వంటి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కారేపల్లి, నవంబర్ 24: ప్రయాణ సమయాన్ని తగ్గించి రాకపోకలను సులభతరం చేయాల్సిన ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ప్రమాదాలు కలిగిస్తున్నాయి. అధికారికంగా ప్రారంభించకముందే వాహనాల రాకపోకలకు అనుమతించడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అయితే వరుస ప్రమాదాలు, ప్రాణనష్ట ఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా వైరా మండల పరిధిలోని హైవే ఎగ్జిట్ వద్ద కారు–లారీ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందగా, వారి కుమారుడు గాయపడ్డాడు.
హైదరాబాద్‌కు చెందిన కోట కిషోర్‌రెడ్డి, ఆయన భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్ అన్నవరం దేవస్థానంలో దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వైరా మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద వారి కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషోర్‌రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ప్రణీత్‌ను చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)