Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- Rumors about North Korean leader Kim Jong Un's death circulated on social media, prompting the state media to release new photographs of him participating in a shoe exhibition. The article also details unverified social media allegations by a Chinese dissident regarding Kim's severe brain hemorrhage and the alleged transfer of his body to Beijing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి మొదలైంది. ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో కోమాలోకి వెళ్లారని.. చికిత్స తీసుకుంటూ మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. కిమ్ చనిపోవడంతో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాను ఆధీనంలోకి తీసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో వీటికి ఉత్తర కొరియా చెక్ పెట్టింది. ఓ ప్రదర్శనలో కిమ్ పాల్గొన్న ఫొటోలను ప్రభుత్వ మీడియా బయటపెట్టింది.
ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రచురించిన ఫొటోల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ వస్త్రాలు, పాదరక్షల ప్రదర్శనను సందర్శించారు. అక్కడ మహిళా ఉద్యోగి చేతిలో ఉన్న చిన్న గులాబీ రంగు షూను పరిశీలిస్తున్నట్లు ఓ ఫొటోలో కనిపించారు. మరో చిత్రంలో అధికారులతో మాట్లాడుతూ చేతులను చాపి ఉన్నారు. ఇంకో ఫొటోలో బొమ్మపై ప్రదర్శనకు ఉంచిన మహిళల కోటు స్లీవ్‌ను తాకుతూ కనిపించారు. అయితే ఫొటోలు ఎప్పుడు తీసినవో స్పష్టత లేదు.