Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొండారెడ్డిపల్లిని వంద శాతం సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలి : నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Nagar Kurnool District Collector Hemant Keshava Patil visited Kondareddypally village in Balmoor mandal and directed officials to develop it into a 100% solar village with solar power for every household.
During the tour, he also inspected the construction of Indira Awas houses, an Anganwadi center, and a Gram Panchayat building, and reviewed a land resurvey in Pollepally village.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
అచ్చంపేట, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని 100 శాతం సోలార్ గ్రామంగా అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ సదుపాయం కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బుధవారం అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కొండారెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో ఇప్పటివరకు 101 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు వివరించారు. మిగిలిన ఇళ్లకు, నూతనంగా నిర్మిస్తున్న ఇళ్లకు కూడా త్వరగా సోలార్ కనెక్షన్లు అందించాలని…
అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ భవన పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని, అంగన్వాడీలో చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రూ.20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తర్వాత పోలేపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలించి, భూముల వివరాలను పారదర్శకంగా, తప్పులు లేకుండా డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. పర్యటనలో మండల స్థాయి ఆఫీసర్లు, టీజీ రెడ్కో ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)