Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Kotia villages: ఒడిశా-ఏపీ పోలీసుల మధ్య తోపులాట.. నేరేడివలసలో ఉద్రిక్తత
By Eenadu1 min read at Eenadu
In brief
Tension between Andhra Pradesh and Odisha police arose in the Kotia border villages over local elections, specifically at Neradi Valasa, after Odisha police intercepted a vehicle carrying PDS rice.
The situation escalated into arguments and physical altercations, with local residents supporting the AP police and removing Odisha police barricades.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సిమిలిగూడ: ఒడిశా-ఏపీ మధ్య ఉన్న వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఏపీ చేపట్టిన స్థానిక ఎన్నికలకు సంబంధించి నేరడివలసలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొఠియా గ్రామాలకు పీడీఎస్ బియ్యంతో వెళ్తున్న వాహనాన్ని నేరడివలసలోని తాత్కాలిక చెక్‌పోస్టు వద్ద ఒడిశా పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో ఈరోజు మధ్యాహ్నం ఏపీ పోలీసులు నేరడివలసకు చేరుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాదనలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు సైతం ఏపీ పోలీసులకు మద్దతు తెలిపారు. అక్కడ ఒడిశా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. ఒడిశా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరగబడ్డారు. దీంతో పరిస్థితి…
ఎన్నికల నేపథ్యంలో కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటికే 7 ప్లాటూన్ల బలగాలు ఉండగా, మరో 10 ప్లాటూన్లు మంగళవారం రాత్రి చేరుకుంటాయని కొరాపుట్ ఎస్పీ రోహిత్ శర్మ తెలిపారు. మరోపక్క కొఠియా గ్రామాల్లో జిల్లా యంత్రాంగం వైద్య, అవగాహన శిబిరాలు ఏర్పాటుచేసింది. పోలింగ్‌లో పాల్గొనకుండా గిరిజనులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే తాము పోలింగ్‌లో పాల్గొంటామని స్థానికులు చెబుతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)