Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కుమారుడి ప్రేమకు తండ్రి బలి
By Eenadu||1 min read at Eenadu
In brief
According to the article, Darem Reddy Ramakrishna Reddy (51) and his elder son Venkata Reddy, who are mechanics in Gurazala, were taken to the fields on a two-wheeler by the girl's family for a discussion.
The girl's family attacked them with sticks and a knife, resulting in the death of Ramakrishna Reddy, while Venkata Reddy escaped and informed the police.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గురజాల గ్రామీణ, న్యూస్టుడే: కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ తండ్రి ప్రాణాలు బలిగొంది. కారంపూడి మండలం మిరియాలకు చెందిన దారెడ్డి రామకృష్ణారెడ్డి (51) పల్నాడు జిల్లా గురజాలలో స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్రవాహనాల మెకానిక్ పనులు చేస్తుండేవారు. చిన్న కుమారుడు లక్ష్మారెడ్డి గోగులపాడుకు చెందిన ఓ యువతితో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నాడు.
సోమవారం వారిద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలిసిన అమ్మాయి కుటుంబసభ్యులు మంగళవారం గురజాల చేరుకుని గొడవకు దిగారు. అనంతరం రామకృష్ణారెడ్డిని, ఆయన పెద్ద కుమారుడు వెంకటరెడ్డిని మాట్లాడుకుందామంటూ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని గోగులపాడు శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరిపై కర్రలతో, కత్తితో దాడిచేశారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేలోపే రామకృష్ణారెడ్డి మరణించారు. ఈ సంబంధించి శివారెడ్డి, నీలకంఠారెడ్డి, కిరణ్, శామ్యేలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)