Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కుండపోత వర్షం.. తడిసిన ధాన్యం..మెదక్ జిల్లాలో జలమయమైన కొనుగోలు కేంద్రాలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Following heavy rainfall in Medak and Siddipet districts on Saturday evening, paddy and maize crops soaked at procurement centers and on roads.
Despite weather warnings, officials failed to supply tarpaulins, prompting farmers to demand the immediate opening of purchase centers and unconditional procurement of the wet grain.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మెదక్/ కొల్చారం/తొగుట, వెలుగు: మెదక్, సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసిన వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసింది. మెదక్ మండలం మాచవరం, కొల్చారం మండలం రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టిపల్లి, చౌరస్తా, అప్పాజిపల్లి, చిన్నఘనపూర్ గ్రామాలతోపాటు తొగుట, మిరుదొడ్డి , రాయపోల్ మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసి కొనుగోలు కేంద్రాల వద్ద, రోడ్ల మీద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొల్చారం మండల కేంద్రంలో గంట పాటు కుండపోత వాన కురియగా పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ప్రదేశం జలమయమైంది. పెద్ద మొత్తంలో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. వడ్ల కుప్పల చుట్టూ నీరు నిలిచింది.…
తొగుట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన వరి ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయి బురదలో కలిసింది. ఘనపూర్ లో రైతులు ఆరబోసిన మక్కజొన్న ధాన్యం తడిసిముద్దైంది. ఆయా చోట్ల దాదాపు వారం రోజుల కిందట నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు రైతులు వడ్లు తెచ్చి ఆరబోస్తుండగా ఇంతవరకు తూకం మొదలు పెట్టలేదు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ అధికారులు టార్పాలిన్ లు సరఫరా చేయలేదు. దీంతో ఆయా చోట్ల భారీగా ధాన్యం తడిసింది. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)