Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
క్యూఆర్ కోడ్‌తో ఉచితంగా..రైతులకు వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్స్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోని రైతులకు క్యూఆర్ కోడ్‌తో ఉచితంగా వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్‌లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.
2028 మధ్య నాటికి మొత్తం 10,750 గ్రామాల్లో భూ రీ-సర్వే పూర్తి చేసి ఈ పాస్‌బుక్‌లను అందిస్తామని ఆయన తెలిపారు.
వ్యవసాయ భూములకు, ఆబాదీ ఆస్తులకు వేర్వేరు రంగుల పాస్‌బుక్‌లు ఇస్తామని, సర్వే ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: సమగ్ర భూ రీ-సర్వే అనంతరం రాష్ట్రంలోని రైతులకు క్యూఆర్ కోడ్‌తో ఉచితంగా వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్‌లు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వ్యవసాయ భూములకు, ఆబాదీ ఆస్తులకు రెండు వేర్వేరుగా పాస్‌బుక్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ల్యాండ్ పార్శిల్‌కు ఒక ఎల్పీఎం నంబర్ కేటాయించి, శాటిలైట్ మ్యాపింగ్‌తో భూముల వివరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు.
ఏడాదిన్నరలో 2028 మధ్య నాటికి రాష్ట్రంలోని మొత్తం 10,750 గ్రామాల్లో ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి ఈ నూతన పాస్‌బుక్‌లు అందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. కొత్త పాస్ పుస్తకాలు చిరిగిపోకుండా, నీళ్లలో తడవని విధంగా రూపొందిస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత భూమి సర్వే నంబర్, ఎల్పీఎం విస్తీర్ణం, శాటిలైట్ ల్యాండ్ పార్శిల్ మ్యాప్, హద్దులన్నీ కనిపిస్తాయని వివరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)