Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Lakshmi Verma | బీజేపీ ఎంపీ లక్ష్మీ వర్మకు రోడ్డు ప్రమాదం.. చేతికి ఫ్రాక్చర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీజేపీ రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ వర్మ (59) శుక్రవారం రాత్రి బాలొడబజార్-భాటాపారా జిల్లాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఆమె కారు ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగోలి సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనంతో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎంపీ లక్ష్మీ వర్మ కుడి చేతికి ఫ్రాక్చర్ కాగా, ఆమె కుమారుడు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, డ్రైవర్ గాయపడ్డారు.
ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయీ, కేబినెట్ మంత్రి శ్యామ్ బిహారీ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేసి ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Lakshmi Verma | బీజేపీ రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ వర్మ (59) కారు ప్రమాదంలో గాయపడ్డారు. శుక్రవారం రాత్రి బాలొడబజార్-భాటాపారా జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై రాయ్‌పూర్‌కు తిరిగి వస్తుండగా.. ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగోలి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. బాలొడబజార్-రాయ్‌పూర్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఎంపీ లక్ష్మీ వర్మతో పాటు ఆమె కుమారుడు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, డ్రైవర్ గాయపడ్డారు.
ప్రమాదంలో లక్ష్మీ వర్మ కుడి చేతికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆమె డ్రైవర్‌కు కాలు, ఛాతీ, చేతికి గాయాలయ్యాయి. మరో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎంపీ లక్ష్మీ వర్మకు మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)