Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
లండన్లో బతుకమ్మ, దసరా వేడుకలు
By Eenadu1 min read at Eenadu
In brief
The Croydon Telugu Association (CTA) organized grand Bonalu and Dasara celebrations at Riddlesdown Collegiate in London, attended by a large number of Telugu people.
The event featured traditional dances around the floral Bonalu and a feast of Telugu food, and was sponsored by several commercial groups including KP Groups, Max Wealth Financial, and Annapurna Rice.
The article also notes that an event organized by TTD Uganda in Kampala, Uganda, set three Guinness World Records during a spiritual program.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
లండన్లోని క్రొయ్దన్ ప్రాంతంలో క్రొయ్దన్ తెలుగు అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిడిల్స్డౌన్ కాలేజియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. పట్టుచీరలు, వోణీలు ధరించిన మహిళలు, యువతులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూలతో అలంకరించిన రంగురంగుల బతుకమ్మలు చూపరులను ఆకట్టుకున్నాయి. గౌరీదేవికి, ప్రకృతి మాతకు సమర్పణగా అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలు చేశారు. దీంతో వేదిక మొత్తం పండగ శోభ నెలకొంది.
తర్వాత అందరికీ పసందైన తెలుగు వంటకాలతో భోజన ఏర్పాట్లు జరిగాయి. 2026 సీటీఏ కమిటీ సభ్యులు సాయి ప్రకాశ్, వెంకట్, ప్రవీణ్, మట్టారెడ్డి, చిరంజీవి, శాంతి, అనేక మంది వాలంటీర్ల అంకితభావం, సహకారంతో ఈ వేడుకలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేపీ గ్రూప్స్, మాక్స్ వెల్త్ ఫైనాన్షియల్, అన్నపూర్ణ రైస్, సుక్రోజ్ కన్స్ట్రక్షన్, ఆభరణ సిల్క్స్, క్రిస్పీ దోస, గ్రీన్ ఆపిల్, వ్రిష్కర్ బ్లైండ్స్తో పాటు ఇతర సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)