Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
LPG Cylinder: మూడో ఫ్లోర్నుంచి విసిరేసిన LPG సిలిండర్ తగిలి.. యువకుడి మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
దిల్లీలోని బిందాపుర్లో ఒక వ్యక్తి తన తల్లితో గొడవపడి, భవనం మూడో అంతస్తు నుంచి ఎల్పీజీ సిలిండర్ను కిందకు విసరగా, అది తగిలి సాహిల్ (30) అనే యువకుడు మృతి చెందాడు.
పోలీసు వర్గాల వివరాల ప్రకారం, ఈ ఘటన శుక్రవారం సాయంత్రం తాలాబ్ వాలా పార్క్ ప్రాంతంలోని ఓ భవనం వద్ద చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి భవన యజమాని మేనల్లుడైన శివమ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి తన తల్లితో గొడవపడి.. భవనం మూడో అంతస్తు నుంచి ఎల్పీజీ సిలిండర్ను కిందకు విసరగా.. అది తలపై పడి మరో యువకుడు మృతి చెందాడు. దిల్లీలోని బిందాపుర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు వర్గాల వివరాల ప్రకారం.. సాహిల్ (30) అనే యువకుడు తాలాబ్ వాలా పార్క్ ప్రాంతంలోని ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు.
శుక్రవారం సాయంత్రం భవనం బయట నిలబడి ఉండగా.. నిండుగా ఉన్న ఓ ఎల్పీజీ సిలిండర్ మూడో అంతస్తు బాల్కనీ నుంచి అకస్మాత్తుగా కిందపడి సాహిల్ తలకు తగిలింది. దీంతో తీవ్ర గాయాలైన అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సాహిల్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి భవన యజమాని మేనల్లుడైన శివమ్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లితో గొడవ పడి, ఆగ్రహంతో బాల్కనీ నుంచి సిలిండర్ను కిందకు విసిరేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)