Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Medical experts highlighted alarming findings of black pollution spots on the lungs of a 14-year-old girl from Kazakhstan during surgery.
The report details that residents of Delhi NCR, including non-smokers and teenagers, are suffering severe lung damage due to toxic air pollution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Lungs | ఢిల్లీలో గులాబీ రంగులో ఉండే ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులను చూడడమే అరుదుగా మారిపోయింది. ఇటీవల కజకిస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల బాలికకు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె ఊపిరితిత్తులు గులాబీ రంగులో కనిపించడంతో ఆపరేషన్ థియేటర్లో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. గులాబీ రంగు ఊపిరితిత్తులు.. అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సాధారణంగా ఊపిరితిత్తులపై నల్లని కాలుష్యపు మచ్చలు కనిపించడానికి వైద్యులు అలవాటు పడిపోయారు. అందుకే ఆరోగ్యకరమైన గులాబీ రంగు ఊపిరితిత్తులు కనిపించడం ఇప్పుడు అరుదైన విషయంగా మారింది.
ఈ విషయాన్ని వివరించేందుకు కొన్ని ఊపిరితిత్తుల నమూనాలను కూడా చూపించారు. ఢిల్లీకి చెందిన ఒక టీనేజర్ ఊపిరితిత్తులపై అప్పటికే స్పష్టంగా నల్లని కాలుష్యపు మచ్చలు కనిపించాయి. ఢిల్లీలో నివసించే, ఎప్పుడూ ధూమపానం చేయని పెద్దవారి ఊపిరితిత్తుల్లోనూ గణనీయమైన స్థాయిలో నల్లని మచ్చలు ఉన్నాయి. పుట్టినప్పుడు మన ఊపిరితిత్తులు స్వచ్ఛమైన గులాబీ రంగులో ఉంటాయి. కానీ మనం పీల్చే విషపూరిత పదార్థాల కారణంగా వాటిపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్ల ఊపిరితిత్తుల్లో కూడా కాలుష్యం వల్ల కలిగిన నష్టం కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)