Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోషకాహార నిపుణులు ఆహారపు అలవాట్లు కాలుష్యం వల్ల శరీరంపై పడే ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయని సూచిస్తున్నారు.
క్యారెట్లు, గుమ్మడికాయ, బ్రొకోలీ వంటి ఆహారాలతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం, బయట తిరగడం తగ్గించడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Lungs Health | ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీఎం2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగపడతాయి. అయితే ఆహారపు అలవాట్లు కూడా కాలుష్యం వల్ల శరీరంపై పడే ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగు రకాల ఆహారపు అలవాట్లను పాటించాలని చెబుతున్నారు.
క్యారెట్లు, గుమ్మడికాయ, చిలగడదుంపలు వంటి బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇవి శ్వాసనాళాల లోపలి పొర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే బాదం, వాల్నట్స్, పాలకూర వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కణాల రక్షణకు తోడ్పడతాయి. వాల్నట్స్ వంటి వాటిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శ్వాసనాళాల్లో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఉసిరి, జామ, నారింజ, నిమ్మ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)