Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మాజీ సర్పంచ్ మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
Gushidi Ramana, a former sarpanch of Ravivalasa village in Vizianagaram district and a senior TDP leader, passed away.
He had sustained injuries in a two-wheeler accident a month prior.
Following his death, TDP and YSRCP leaders offered floral tributes to his mortal remains.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చీపురుపల్లి గ్రామీణం: విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలస మాజీ సర్పంచ్, తెదేపా సీనియర్ నాయకుడు గుషిడి రమణ(70) అనారోగ్యంతో శుక్రవారం వేకువాజామున కన్నుమూశారు. నెల రోజుల క్రితం జరిగిన ఒక ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడిన ఆయన, ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి తెదేపా సీనియర్ కార్యకర్తగా పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. 2014-2019 మధ్య కాలంలో రావివలస గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న తెదేపా, వైకాపా నాయకులు రమణ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)