Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the police, two engineering students died of electrocution after fleeing a police patrol while drinking alcohol in an open area in Rangareddy district.
The students reportedly touched an electric fence set up to protect a farm from wild boars while trying to escape.
The police have initiated an investigation and may register a case against the farmer who installed the electric fence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మొయినాబాద్, అక్టోబర్ 31: మద్యం తాగేందుకు బహిరంగ ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు . పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో పంట పొలానికి పందుల బెడద నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి పెద్దమంగళారం రెవెన్యూ పరిధిలోని పద్మావతి ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న బహిరంగ ప్రదేశంలో మద్యం తాగేందుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవిస్తుండగా అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అటుగా వచ్చింది. దాన్ని చూసిన విద్యార్థులు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో అడవి పందుల నుంచి పంట కాపాడుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ వేసిన విద్యుత్ తీగలకు తగిలారు. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)