Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మహాత్మ’కు మొండిచెయ్యి!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Telangana Finance Department issued GO 142 to fill vacant Assistant Professor posts across various universities, but MG University in Nalgonda was excluded from the first phase of recruitment. Local unemployed candidates, student unions, and politicians strongly criticized this decision, accusing the government of treating MG University unfairly and using contract and part-time staff instead of permanent faculty.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
రామగిరి, అక్టోబర్ 18: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆదివారం జీవో 142 విడుదల చేసింది. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మొదటి విడత భర్తీ ప్రక్రియలో ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కూడా కేటాయించకపోవడంపట్ల జిల్లాలోని ఆశావహులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నప్పటికీ జిల్లాలోని ఏకైక వర్సిటీకి అన్యాయం జరుగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2007లో ప్రారంభమైన ఎంజీయూకు ఇప్పటి వరకు 32 మంది అధ్యాపకులనే ఫ్రభుత్వం నియమించిందని, మిగిలిన విభాగాలు కాంట్రా క్టు, పార్ట్టైమ్ అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నాయని ఆరోపిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన యూనివర్సిటీ కాలే జ్ ఆఫ్ లా, ఫార్మసీలకు కొత్త పోస్టులు మంజూరు చేసి నా ప్రస్తుత భర్తీ ప్రక్రియలో వాటి నియామకానికి అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. మిగిలిన యూనివర్సిటీలకు భర్తీ అవకాశం ఇచ్చిన సర్కార్ ఎంజీయూపై చూపిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.