Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మహిళా కోటాను డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు.
మహిళలకు చట్టసభల్లో కల్పించనున్న 33 శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా ప్రస్తుతం ఉన్న సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ స్వాగతించారు. మహిళలకు చట్టసభల్లో కల్పించనున్న 33 శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్ అంశంతో ముడిపెట్టకుండా, ప్రస్తుతం ఉన్న సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. సబ్ కోటా లేకుంటే మహిళలకు తగిన ప్రాతినిధ్యం దకదని తెలిపారు. మహిళా సాధికారతతోపాటు అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే …
మహిళా రిజర్వేషన్ల కోసం దశాబ్దకాలంగా బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 జూన్ 14న పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఆ ప్రకటనలో ప్రస్తావించారు. 2023 సెప్టెంబర్ 15న కూడా ఈ చట్టాన్ని తక్షణమే ఆమోదించాలని ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేనందున దానితో రిజర్వేషన్లను ముడిపెడితే అమలు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉన్నదని పేరొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)