Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Manchester Concert: సంగీత కచేరీలో రసాయనం కలకలం.. 12 వేలమంది తరలింపు
By Eenadu1 min read at Eenadu
In brief
బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో అమెరికన్ ర్యాపర్ డాన్ టొలివర్ సంగీత కచేరీలో గుర్తుతెలియని రసాయనం వ్యాప్తి చెందింది.
ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ప్రేక్షకులు కళ్ల మంట, దగ్గుతో ఇబ్బందులు పడ్డారు, దీంతో నిర్వాహకులు దాదాపు 12 వేలమందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
అధికారులు 80 మందికిపైగా చికిత్స అందించగా, పోలీసులు ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో అమెరికన్ ర్యాపర్ డాన్ టొలివర్ సంగీత కచేరీ (Manchester Concert)లో గుర్తుతెలియని రసాయనం వ్యాప్తి చెందడం రేపింది. దీంతో అక్కడున్నవారు కళ్ల మంట, దగ్గుతోపాటు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఈ పరిణామాలతో అప్రమత్తమైన నిర్వాహకులు దాదాపు 12 వేలమందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. 80 మందికిపైగా చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.
సంగీత కచేరీ జరుగుతున్న ‘కో-అప్ లైవ్’ అరీనాలో రసాయనం వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొదట్లో దాన్ని టియర్ గ్యాస్‌గా భావించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ‘ప్రధాన విపత్తు’గా ప్రకటించారు. దీంతో అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. కచేరీ ప్రాంగణంలో భరించలేని వాసన రావడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారని, కొంతమంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)