Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Yadadri Bhuvanagiri District SP Akshash Yadav flagged off a 2K run in Ramannapet on Thursday as part of Police Martyrs' Reform Week.
He urged students, youth, and police personnel to prioritize their health through daily exercise and to stay away from cybercrimes and frauds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రామన్నపేట, అక్టోబర్ 29 : ప్రతి ఒక్కరు మత్తు పదార్దాల నివారణకు పాటు పడాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆక్షాష్ యాదవ్ అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సావాల్లో భాగంగా నిర్వహించిన 2కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులు, యువత, పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆరోగ్యంగా ఉడేందుకు రోజు తమ దిన చర్యగా వ్యాయామం చేయాలన్నారు. ప్రతి రోజు వ్యాయమం చేయడం వల్ల మానసిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని అన్నారు. సైబర్ నేరాలకు, మోసాలకు దూరంగా ఉండాలన్నారు.
విద్యార్ధులు, యువత క్రమశిక్షణతో మెలగాలన్నారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగహన కల్పించడం పట్ల పోలీస్ శాఖకు ప్రజలకు మధ్య సత్సంబధాలను మరింత బలోపేతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసుదన్‌రెడ్డి, రామన్నపేట సీఐ ఎం.రవి, ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు, ఎస్ఐలు జి.సతీష్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, సతీష్, వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు కమాలాకర్, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది లింగస్వామి, స్వామి నాయక్, ప్రవీణ్, ప్రశాంత్, స్వామి, మధు, కృష్ణమూర్తి, నర్సింహ్మ, లావణ్య, కవిత, సైదులు, సైదయ్య పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)