Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Relying farmers in Medak district's Ramayampet mandal alleged they were sold fake seeds at the Venkateshwara Seed Fertilizer shop, resulting in severe crop yield losses.
The shop owner reportedly threatened to file police cases if they complained.
The farmers stated they would file a grievance at the District Collector's Prajavaani and demanded strict action against the shop owner, while agricultural officials visited the affected fields to assess the damage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మెదక్ అర్బన్, అక్టోబర్ 27 : విత్తనాలతో మోసపోయామని, విత్తనాలు ఇచ్చిన ఫర్టిలైజర్ షాపు యజమానిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని మెదక్ జిల్లా రామాయంపేట మండలం అవుసులపల్లి బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలోని వెంకటేశ్వర సీడ్ ఫర్టిలైజర్ షాప్లో విత్తనాలు కొని నాటు వేస్తే ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు.
తీరా మోసపోయామని గుర్తించి సదరు ఫర్టిలైజర్ సీడ్ షాపు యజమాని దగ్గరికి వెళ్తే దానికి బాధ్యత నాది కాదని దురుసుగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు. రైతులు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని రైతులు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో దరఖాస్తు చేస్తామన్నారు. అధికారులు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. పంట నష్టాన్ని పరిశీలించి పై అధికారులకు సమగ్ర నివేదిక పంపిస్తామని తెలిపారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)