Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మెడికవర్ ఘటనపై ఎన్‌హెచ్చార్సీ నోటీసులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The National Human Rights Commission (NHRC) issued notices regarding the death of junior lawyer T.
Aishwarya at Medicover Hospital in Secunderabad following kidney stone surgery.
The case was registered based on a complaint filed by advocate and social activist Karupothula Revanth, and the NHRC ordered the Telangana Health Secretary and Cyberabad Police Commissioner to investigate and submit a report within four weeks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ): సికింద్రాబాద్‌లోని మెడికవర్ దవాఖానలో ఇటీవల జూనియర్ న్యాయవాది టీ ఐశ్వర్య మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది. కిడ్నీలో రాళ్ల శస్త్ర చికిత్స అనంతరం 28 ఏండ్ల వయసున్న ఐశ్వర్య మృతి ఘటనపై తెలంగాణ హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసింది. బుధవారం దానిని పరిశీలించి, ఫిర్యాదు ప్రతిని తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు పంపింది.
తగిన చర్యలు తీసుకొని నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీచేసింది. వార్తా కథనాల ప్రకారం, ఐశ్వర్య ఈ నెల 7న కిడ్నీలో రాళ్ల చికిత్స కోసం సికింద్రాబాద్ మెడికవర్ దవాఖానలో చేరి, శస్త్రచికిత్స అనంతరం మృతి చెందారు. ఆ శస్త్రచికిత్స అవసరం లేనిదని, దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి సరిగా వివరించలేదని, సమాచారంతో కూడిన సమ్మతి తీసుకోలేదని, రోగిని చూడటానికి గానీ, వైద్య రికార్డులు పొందడానికి గానీ తమను అనుమతించలేదని, చికిత్స పేరుతో భారీ మొత్తాలు డిమాండ్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు ఫిర్యాదులో పేరొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)