Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్లలో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Korutla MLA Dr.
Kalvakuntla Sanjay suggested that officials take preventive measures to avoid future drinking water problems for the town's residents.
He directed authorities to explore alternative routes to fill Talacheruvu and to speed up Mission Bhagiratha repair work, expressing anger over recent water supply interruptions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, నవంబర్ 5 : కోరుట్ల పట్టణ ప్రజలకు భవిష్యత్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ మున్సిపల్ అనుబంధ గ్రామం ఎకిన్ పూర్ శివారులో గల ఎస్సారెస్పీ కెనాల్ నుంచి మత్తడి ద్వారా కోరుట్ల లోని తాళ్ల చెరువుకు అలైన్మెంట్ ద్వారా నీటిని నింపాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తాళ్ళచెరువు నుంచి నీటిని అయ్యప్ప గుట్ట ఫిల్టర్ బెడ్ కు మళ్ళించి అత్యవసర సమయంలో పట్టణ వాసులకు తాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఏవైనా అంతరయాలు, కరువు పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో ఈ ప్రత్యామ్నాయ విధానం ద్వారా పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీటిని అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలైన్మెంట్ పనులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత రైతుల తో ముందస్తుగా చర్చించాలని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎస్సారెస్పీ నీటిని ఉపకాలువ ద్వారా తాళ్ల చెరువులోకి నీటిని మళ్ళించి నింపడం వల్ల భవిష్యత్తులో కోరుట్లలో తాగునీటి సమస్య నివారించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)