Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Modi Cabinet announced a 78-day Diwali bonus for 11.4 lakh non-gazetted railway employees, totaling ₹2,009 crore. The bonus, paid under the PLB scheme, will benefit various railway staff including track maintainers and station masters, with a maximum payout of ₹17,951 per employee. The Railway Board also warned employees to be vigilant against fake bonus letters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Modi Cabinet : రైల్వే శాఖ ఉద్యోగులకు మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అందించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దసరా బోనస్ ప్రకటిస్తూ మోదీ క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ బోనస్ మొత్తం విలువ రూ.2,009 కోట్లుగా ఉంది. పీఎల్బీ (ప్రొడక్టివిటీ లింకుడ్ బోనస్) కింద ఉద్యోగులకు ఈ మొత్తం రైల్వే శాఖ చెల్లించనుంది. ఈ నిర్ణయం ద్వారా 11,40,770 మంది రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ప్రతి ఏడాది దసరా సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటిస్తుంటుంది. ఈ ఏడాది 78 రోజుల బోనస్ ప్రకటించింది. ఒక ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 వరకు అందుతాయి. 78 రోజుల బోనస్ అయినప్పటికీ.. చెల్లింపులపై పరిమితి వల్ల ఈ మొత్తం తక్కువగా ఉంటుంది. దీనిద్వారా ట్రాక్ మెయింటెనర్స్, స్టేషన్ మాస్టర్స్, ట్రైన్ మేనేజర్లు, టెక్నీషియన్లు, లోకోపైలట్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్ హెల్పర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, పాయింట్మ్యాన్తోపాటు ఇతర గ్రూప్-సి సిబ్బందికి బోనస్ అందుతుంది. బోనస్ ప్రకటన సందర్భంగా కేంద్ర క్యాబినెట్ కీలక వ్యాఖ్యలు చేసింది.