Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mohan Bhagwat: ప్రపంచంలోని సమస్యలన్నింటికీ మూలం అదే: ఆరెస్సెస్ చీఫ్
By Eenadu1 min read at Eenadu
In brief
RSS chief Mohan Bhagwat stated in Nagpur that all global problems stem from a lack of affection for others.
He emphasized the need to cultivate a sense of universal kinship and silent, selfless service.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని సమస్యలన్నీ ఇతరుల పట్ల ఆత్మీయతా భావం లేకపోవడం నుంచే పుడుతున్నాయని ఆరెస్సెస్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మనకు చెందినవారేననే భావనను అందరూ పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో సమర్పణ్ ఫౌండేషన్ రజతోత్సవ కార్యక్రమంలో ఆయన (Mohan Bhagwat) పాల్గొని ప్రసంగించారు. ‘‘ఆత్మీయతా భావం అనేది యావత్ ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలను అందించడంలో సాయపడుతుంది’’ అని తెలిపారు.
‘‘నేను, నాది అనే భావనలతోనే అన్ని సమస్యలు ముడిపడి ఉన్నాయి. వీటిని అధిగమించాలంటే.. ‘అందరూ మనవారే’ అనేది పెంపొందించుకోవాలి. మనం ఎలాగైతే మన మంచిని ఆశిస్తామో.. అలాగే ఇతరులు కూడా బాగుండాలని కోరుకోవాలి. మనుషులు సహజంగానే కరుణ స్వభావం కలిగినవారు. అందుకే సేవాస్ఫూర్తిని అలవర్చుకున్నారు. సొంత జీవితాన్నే కాకుండా.. ఇతరుల బాగోగులనూ పట్టించుకుంటారు. అయితే, సేవ అనేది ప్రదర్శన కోసం కాకుండా.. నిశ్శబ్దంగా, అవిశ్రాంతంగా కొనసాగాలి’’ అని భాగవత్ ఆకాంక్షించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)