Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మూడు కారిడార్లలో పీఆర్టీఎస్.. సీఎం రేవంత్ ఆమోదం
By Eenadu2 min read at Eenadu
In brief
Chief Minister Revanth Reddy approved three Personal Rapid Transit System (PRTS) corridors in Hyderabad.
He ordered Metro Rail officials to complete the tendering process by December and start the first route immediately.
The other two routes will connect LB Stadium to Ranigunj and Assembly Metro to Begumpet.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, హైదరాబాద్: పాడ్ కార్లతో నడిచే అధునాతన రవాణా వ్యవస్థ పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్టీఎస్)లో మూడు మార్గాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మార్గాల టెండర్ల ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తిచేయాలని మెట్రోరైలు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీఈలోని బోధి పెవిలియన్‌లో పీఆర్‌టీఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. పీఆర్టీఎస్ మార్గాలపై లీ అసోసియేట్స్ అధ్యయన నివేదికపై ఇటీవలే మెట్రో అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ఆ మేరకు చేసిన మార్పుల ఆధారంగా మూడు మార్గాలను ఎంపిక చేశారు.
కేపీహెచ్బి మెట్రోస్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రోస్టేషన్ వరకు మార్గాన్ని వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు. గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేసి అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలన్నారు. ఏడాదిలో ఈ లైన్ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం, ఇందిరాపార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్‌స్టాండ్ వరకు మరో లైన్ ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ మెట్రో నుంచి రవీంద్ర భారతి, సెక్రటేరియట్, ఐమాక్స్ నుంచి బేగంపేట్‌ను కలుపుతూ ఇంకో మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నెక్లెస్ రోడ్లో మల్టీలెవల్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)