Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
MVSR బీటెక్ కాలేజ్‌లో లైటింగ్ ట్రస్ కూలిన ఘటనలో కీలక పరిణామం
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
An incident occurred at MVSR Engineering College in Rangareddy district, Telangana, where a lighting truss collapsed during a Dandiya event, resulting in the death of a student and injuries to 22 others.
The police investigation has identified the negligence of the event organizers and subcontractors as the primary cause.
Three suspects have since surrendered to the police, and authorities have seized equipment from the site.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రంగారెడ్డి జిల్లా ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో లైటింగ్ ట్రస్ కూలిన ఘటనలో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో దసరా సందర్భంగా నిర్వహించిన దాండియా కార్యక్రమంలో ఇనుప ట్రస్ నిర్మాణం కూలిన ఘటనలో ఒక యువతి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ముగ్గురు ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అక్టోబర్ 17వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థినులు గాయపడ్డారు.
చికిత్స పొందుతూ నారాయణదాస్ సోనా అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న నిర్వాహకులు.. సబ్ కాంట్రాక్టర్లు.. ఇనుప ట్రస్ నిర్మాణం చేపట్టిన వ్యక్తుల నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు పిల్లర్లతో ఏర్పాటు చేయాల్సిన ఇనుప ట్రస్‌ను కేవలం రెండు పిల్లర్లతోనే ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)