Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నాకు ఎలాంటి నోటీసులు అందలేదు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Jadcherla Congress MLA Anirudh Reddy stated he has not received any notices from the Pradesh Congress Committee (PCC) regarding his comments on fund allocation.
He clarified that PCC chief Mahesh Kumar Goud did not announce disciplinary action against him and emphasized that seeking funds for his constituency is a legitimate demand.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జడ్చర్ల, అక్టోబర్ 30 : నిధుల కోసం తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ.. నిధుల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకుగాను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారని విలేకరులు ప్రశ్నించగా.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పలేదని అన్నారు.
‘మంత్రులకే నిధులా? ఎమ్మెల్యేలకు నిధులు లేవా? అని ప్రభుత్వాన్ని అడిగాం.. నియోజకవర్గాలలో అభివృద్ధి జరుగాలంటే నిధులు ఇవ్వాలి.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని కోరాం.. అందులో తప్పేముంది?’ అని అన్నారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడంలేదని మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా అన్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నట్టు తాను విన్నానని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ తనను అడిగితే వివరణ ఇస్తానని అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. నిధుల కోసం తాను కొట్లాడుతానని స్పష్టంచేశారు. అది తమ అంతర్గత విషయమని చెప్పుకొచ్చారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)