Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నేడు కేఆర్ఎంబీతో బీఆర్ఎస్ బృందం భేటీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను పరిరక్షించాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న సొరంగం నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ, కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులను కలవనుంది.
నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు చేపడుతున్న నిర్మాణాలతో తెలంగాణ నీటి హకులకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేయనున్నది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కీలకమైన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వలను పరిరక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో చేపడుతున్న సొరంగం నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అధికారులను కలువనున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ప్రజాప్రతినిధులతో కూడిన సుమారు 10 మంది సభ్యుల బృందం ఉదయం 10.30 గంటలకు బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేయనున్నది.
పల్నాడు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న సొరంగం నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలు, వాటి ప్రభావంపై బోర్డు సమగ్రంగా పరిశీలించాలని ప్రతినిధి బృందం కోరనున్నది. హైదరాబాద్ నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో తగిన నీటి నిల్వలను కాపాడాలని, ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న నిర్మాణాలతో తెలంగాణ నీటి హకులకు, తాగునీటి ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేయనున్నది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)