Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- National Health Mission (NHM) employees in Nagarkurnool district, Telangana, have been on an indefinite strike for the seventh day. They protested by wearing nooses around their necks to demand regularization and equal pay. The employees appealed to the Chief Minister and Health Minister to resolve their issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
నాగర్కర్నూల్ : జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నాగర్కర్నూల్ ( Nagarkurnool ) జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మెడలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను ఆదుకోకపోతే తమకు ఉరి తాళ్లే దిక్కవుతాయని పేర్కొన్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.