Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నితీశ్ కోసం 9 హత్యలు చేయించా.. ఎమ్మెల్యే అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- JDU MLA Anant Singh sparked a major political controversy in Bihar by claiming he had arranged 9 murders for former Chief Minister Nitish Kumar to help him politically. The JDU distanced itself from the remarks, while the RJD demanded an investigation, and Anant Singh later retracted his statements while blaming the RJD government for the violence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
పాట్నా: మాజీ సీఎం నితీశ్ కుమార్ కోసం ‘9 చేయించా’ అంటూ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన కామెంట్లు బిహార్ పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వివాదంపై జేడీయూ పార్టీ వెంటనే స్పందించి తమకేం సంబంధంలేదని ప్రకటించగా.. అనంత్ సింగ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. మొకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్, రాబోయే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్కు పార్టీ టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల16న తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన నితీశ్ కుమార్ను ఉద్దేశించి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘నితీశ్ తో నాకు చాలాకాలంగా మంచి సంబంధాలున్నాయి. ఆయనకు సాయం చేయడానికి నేను 9 మందిని హత్య చేయించాను. రాజకీయంగా బలపడేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో నేను అండగా నిలిచాను’ అంటూ అనంత్ సింగ్ పేర్కొన్నారు.