Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
NMACC చొరవ.. భారత్‌కు విజిటర్స్ లయన్ అవార్డు
By Eenadu1 min read at Eenadu
In brief
వెనిస్లో జరిగిన 61వ లా బినాలే డి వెనిజియా-2026లో 'బెస్ట్ నేషనల్ పార్టిసిపేషన్' విభాగంలో భారతదేశం విజిటర్స్ లయన్ అవార్డును గెలుచుకుంది.
ఏడేళ్ల విరామం తర్వాత ఈ పురస్కారం దక్కింది.
నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC), సెరెండిపిటీ ఆర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ జాతీయ పెవిలియన్‌ను ఏర్పాటు చేయగా, ఈశా అంబానీ ఈ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
వెనిస్: అంతర్జాతీయ కళా, సాంస్కృతిక వేదికపై భారతదేశం సత్తా చాటింది. వెనిస్లో జరిగిన 61వ లా బినాలే డి వెనిజియా-2026లో మన దేశానికి విజిటర్స్ లయన్ అవార్డు లభించింది. ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌ను ఈ అవార్డు వరించింది. ‘బెస్ట్ నేషనల్ పార్టిసిపేషన్’ విభాగంలో ఓటింగ్ ద్వారా ఈ పురస్కారం దక్కింది. ఈ విజయంలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) కీలక పాత్ర పోషించింది. NMACC ఛైర్పర్సన్ నీతా అంబానీ, డైరెక్టర్ ఈశా అంబానీ చొరవతో సమకాలీన భారతీయ కళకు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లభించింది.
భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, NMACC, సెరెండిపిటీ ఆర్ట్స్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ జాతీయ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. డాక్టర్ అమీన్ జాఫర్ క్యూరేటర్‌గా వ్యవహరించారు. అల్వార్ బాలసుబ్రమణియం, రంజని శెట్టార్, సుమాక్షి సింగ్, స్కర్మా సోనమ్ తాషి, అసిమ్ వకీఫ్ కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయంపై రిలయన్స్ డైరెక్టర్ ఈశా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ‘వెనిస్ బినాలేలో భారత్‌కు ఈ గుర్తింపు లభించడం దేశం గర్వించదగ్గ విషయం. భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేది మా అమ్మ నీతా అంబానీ కల. నేడు అది నిజమైంది’ అని ఈశా పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)