Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
North Karnataka | కొన్నేళ్లలో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
బెంగళూరులో డిసెంబర్ 2న కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఈ వార్త తెలియజేస్తుంది.
బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా మారవచ్చని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఉమేష్ కత్తి వాదనను ఆయన సమర్థించడంతో పాటు, మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చిందని నివేదించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: కొన్నేళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా మారవచ్చని బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి తెలిపారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఇది నిజం కావచ్చునని ఆయన అన్నారు. డిసెంబర్ 2న ఉత్తర కర్ణాటకలోని బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. (BJP MLA Balakrishna Jarkiholi) ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పట్టున్న బీజేపీకి చెందిన అరభావి ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ‘సువర్ణ విధాన సౌధ’ను బెళగావిలో నిర్మించారని ఆయన తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదని మాజీ మంత్రి అయిన ఆయన మీడియాతో అన్నారు.
కాగా, ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రం కోసం మాజీ మంత్రి ఉమేష్ కత్తి చేసిన వాదనను బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి సమర్థించారు. ‘కొన్నిసార్లు, అది మంచి ఆలోచన అని మాకు కూడా అనిపించేది. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే, బెళగావి దాని రాజధాని అవుతుందని, ఈ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుందని ఆయన చెప్పేవారు. బహుశా మరో ఐదు లేదా పది ఏళ్లలో పరిస్థితులు ఆ దిశగా మారవచ్చు. ఇది ఖచ్చితంగా జరుగవచ్చు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం’ అని ఆయన అన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)