Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నువ్వేం సీఎం? నీదేం భాష?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని ఆరోపిస్తూ, వెనుకబడిన నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మునుగోడు అభివృద్ధి కోసం తాను ఇంకా కొట్లాడుతానని స్పష్టం చేస్తూ, ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
నల్లగొండ ప్రతినిధి, నవంబర్18(నమస్తే తెలంగాణ)/మునుగోడు: ‘అసలు నువ్వేం సీఎంవు.. నీ భాషేంది? ఏమనుకుంటున్నవు? ఏదో అదృష్టం కలిసొచ్చి సీఎం అయినవ్ అంతే’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి 2 తీవ్రస్థాయిలో . ‘కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు కాకుంటే రూ.20 వేల కోట్లు తీసుకుపో.. కానీ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేనైన తాను నిధులు అడుగుతుంటే.. దాన్ని పాజిటివ్‌గా ఆలోచించాల్సింది పోయి.. పండబెట్టి తొక్కుతా అంటావా? ఏం తొక్కించుకునేటందుకు రాజగోపాల్‌రెడ్డి అంత ఈజీగా కనపడుతుండా నీకు?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మూడేండ్ల పాలనలో తెలంగాణ ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని, మిగిలి ఉన్న రెండేండ్లయినా మంచి పనులు చెయ్యి’ అంటూ హితవు పలికారు. మునుగోడుకు అన్యాయం చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, సీఎంగా తండ్రి పాత్రలో ఉన్న మీరు అందరినీ సమానంగా చూడాలని, వివక్ష, పక్షపాతం చూపొద్దని, వెనుకబడిన నియోజకవర్గాలకు అన్యాయం చేయొద్దని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం చేయూత కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)