Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒఎల్ఎక్స్ వస్తువుల విక్రయం పేరుతో సైబర్ మోసాలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఆన్లైన్ ప్లాట్ ఫామ్లైన ఒఎల్ఎక్స్లో వస్తువులు విక్రయించే వారిని సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు.
ఒక బాధితురాలు తన పాత సోఫాను విక్రయించేందుకు ప్రకటన ఇవ్వగా, కొనుగోలుదారులుగా నటించిన నేరగాళ్లు ఆమెను మోసం చేసి రూ.12,20,822 వసూలు చేశారని సీపీ వివరించారు.
ఈ మోసంపై బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ మారెట్ప్లేస్ల్లో పాత వస్తువులను విక్రయించే వారిని లక్ష్యంగా చేసుకుని, కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఒఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్లలో వస్తువులను విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రజలకు సూచించారు. ఇటీవల ఓ యువతి తన పాత సోఫాను విక్రయించేందుకు ఒఎల్ఎక్స్లో ప్రకటన ఇవ్వగా, కొనుగోలుదారులుగా నటించిన సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. సోఫా కొనుగోలు చేస్తామని నమ్మించి, తొలుత కొంత మొత్తాన్ని ఆమె ఖాతాకు పంపించి నమ్మకం కలిగించారు. అనంతరం డబ్బులు…
క్యూర్ కోడ్ సాన్ చేస్తే డబ్బులు జమ అవుతాయని నమ్మించి, యూపీఐ పిన్ నమోదు చేయించి ఆమె ఖాతా నుంచి నగదు మొత్తం ఖాళీ చేయడమే కాకుండా, ఆ డబ్బులు తిరిగి వస్తాయని, రెట్టింపు అవుతాయని నమ్మిస్తూ బ్యాంక్ వెరిఫికేషన్, రీఫండ్ ప్రాసెసింగ్, బ్లాక్ అయిన నగదు విడుదల తదితర కారణాలు చెబుతూ పలుమార్లు డబ్బులు వసూలు చేసి మోసగించినట్లు సీపీ వివరించారు. అంతేకాకుండా, పోలీసు అధికారులుగా సహా వివిధ వ్యక్తులుగా నటిస్తూ బాధితురాలిని ఫోన్ ద్వారా బెదిరించారని, పోలీసు చర్యలు తీసుకుంటామని భయపెట్టి మరిన్ని డబ్బులు వసూలు చేశారని సీపీ తెలిపారు. ఈ విధంగా బాధితురాలు మొత్తం రూ.12,20,822 నష్టపోయిందని వివరించారు. దీంతో జరిగిన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)