Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ నజర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
IT officials from Telangana, Andhra Pradesh, Madhya Pradesh, Chhattisgarh, and Uttarakhand conducted simultaneous raids at Omega Hospitals and the residences of its founder and key medical staff on Friday.
The raids targeted allegations of tax evasion and large-scale illegal cash transactions, with investigators seizing documents and computer hard drives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ వైద్య సేవల్లో ఖ్యాతి పొందిన ఒమేగా హాస్పిటల్స్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేతలు, భారీగా అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఒమేగా హాస్పిటల్స్ శాఖలతోపాటు వాటి వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ మోహన వంశీ, ఇతర కీలక వైద్యులు, ఉన్నతాధికారుల నివాసాలు, కార్యాలయాలు సహా 24 ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య విసృ్తత సోదాలు నిర్వహిస్తున్నారు.
‘ఒమేగా’ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, ఫైనాన్స్, అకౌంట్స్ విభాగాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్డిస్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఎనిమిది ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా 2010లో ప్రారంభమైన ఒమేగా హాస్పిటల్స్‌కు గుంటూరు, విశాఖపట్నం, భీమవరం, కర్నూలు, తిరుపతి, కరీంనగర్, జబల్పూర్, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో శాఖలు ఉన్నాయి. ఇవి సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, కీమోథెరపీ, రేడియో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)