Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎంపీ సానా సతీష్ బాబు
By Eenadu1 min read at Eenadu
In brief
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 66/2 పోలింగ్ బూత్‌లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆయన మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు మరియు కూటమి ప్రభుత్వ పాలనలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొందని తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా, స్టేడియం రోడ్డులోని హౌసింగ్ బోర్డు కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసిన 66/2 పోలింగ్ బూత్‌లో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “మన ఓటు.. మన భవిష్యత్తు.. ఓటు వేయడం మన బాధ్యత” అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాకినాడలో ప్రశాంత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా వినియోగించుకోవడమే ప్రజాస్వామ్య విజయానికి తొలి మెట్టు అని ఎంపీ అన్నారు. ముఖ్యంగా జెన్ జీ యువత ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి చూపుతూ పోలింగ్‌లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)