Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఓయూలో నాన్ టీచింగ్ ఉద్యోగుల రిలే దీక్షలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఉస్మానియా యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి నాన్ టీచింగ్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
ఈ దీక్షలకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు.
ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తాము ఈ దీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: ఉస్మానియా యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి నాన్ టీచింగ్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా రిలే నిరాహార దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఓయూ పరిపాలనా భవనం ఎదుట ప్రారంభించిన ఈ దీక్షలకు ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై తమ పోరాట పటిమను చాటుకున్నారు. ఈ దీక్షలకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తాము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందన్నారు.
తాము వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టి దాదాపు మూడు వారాలు గడుస్తున్న అటు ప్రభుత్వం, ఇటు అధికారులు ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా, వాటిని పరిష్కరించకపోవడంతోనే దశలవారీగా నిరసనలకు దిగినట్లు తెలిపారు. ఇప్పటికైనా స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని ..లేనిపక్షంలోనిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)