Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పారదర్శకంగా జన గణన: కలెక్టర్ రాజర్షిషా
By Eenadu||1 min read at Eenadu
In brief
ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో సబ్ డివిజన్ స్థాయి అధికారులకు సెన్సస్-2027 శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, భవిష్యత్తులో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా అవసరాల ప్రణాళికలకు జనాభా గణన కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ కలెక్టరేట్ : భారత ప్రభుత్వ జనాభా గణన–2027లో భాగంగా చేపట్టనున్న రెండో దశ జనాభా లెక్కింపు (ఫేజ్–II: పాపులేషన్ ఎన్యుమరేషన్)ను జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక టీటీడీసీలో సబ్ డివిజన్ ఛార్జ్ స్థాయి అధికారులకు రెండు రోజులపాటు నిర్వహించిన సెన్సస్–2027 ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా అవసరాల ప్రణాళికలకు జనాభా గణన కీలకంగా నిలుస్తుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, నమోదు విధానం, సాంకేతిక అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాస్టర్ ట్రైనర్లు అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా కోఆర్డినేటర్ కృష్ణయ్య, డీఆర్వో స్రవంతి, సూపరింటెండెంట్ నలంద ప్రియ, మాస్టర్ ట్రైనర్లు వెంకటరమణ, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)