Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పల్లెల్లో హ్యామ్ రోడ్ల పనులకు లైన్ క్లియర్!..17 ప్యాకేజీల టెండర్లు కంప్లీట్
By V6 Velugu||4 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- The government has approved the tender process for rural road construction projects under the Hybrid Annuity Model (HAM) in Telangana, allocating ₹6,294 crores for 2,145 roads across the state. The first phase of construction is scheduled to begin immediately after Diwali, with the government aiming to complete the work in 18 months. The project details include specific allocations for various districts and assembly segments, with a significant portion of the contracts awarded to companies from other states.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో రవాణా కష్టాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చింది. తొలి విడత కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న రహదారుల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 7,445 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 2,145 రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.6,294 కోట్లను ఖరారు చేసింది. మొత్తం 17 ప్యాకేజీలుగా విభజించి పిలిచిన ఈ టెండర్లకు లైన్ క్లియర్ అయ్యింది.
దీపావళి పండుగ ముగియగానే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. హ్యామ్ విధానం ప్రకారం ఈ ప్రాజెక్టును 40:60 నిష్పత్తిలో చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా కింద రూ.2,500 కోట్లను సర్కారు చెల్లించనుండగా, మిగిలిన రూ.3,500 కోట్లను కాంట్రాక్ట్ సంస్థలే సమకూర్చుకోనున్నాయి. కాంట్రాక్టర్లతో పదిహేడున్నర సంవత్సరాల కాలపరిమితితో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు.