Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు: డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా
By Eenadu1 min read at Eenadu
In brief
ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఈనెల 26న జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 46,080 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఈనెల 26న జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. 46,080 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి.. అక్కడ అదనపు బలగాలతో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 26 జిల్లాల్లోని 201 మండలాల్లోని 3,191 సర్పంచ్ స్థానాలకు, 25,061 వార్డులకు ఈ నెల 26న ఎన్నిక జరగనుంది. వీటితోపాటు రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లలో 258 వార్డులు, 19…
రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, డ్రోన్లు, బాడీ ఓన్ కెమెరాలు, సమర్థ్ యాప్, ట్రేస్ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నామన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి సజావుగా జరిగేలా చూస్తామన్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను బైండోవర్ చేసినట్లు డీజీపీ తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)