Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పండుగ సాయన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్
By Eenadu||1 min read at Eenadu
In brief
The Adilabad Collector, Rajarshi Shah, along with other officials, paid floral tributes to the statue and portrait of Panduga Sayanna on his birth anniversary.
The Collector urged everyone to take Sayanna's fight for the weaker sections as a model and announced that over 200 youth are receiving free training through BC study circles for police and foundation courses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ కలెక్టరేట్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ద్వారకానగర్ రోడ్ లోని పండుగ సాయన్న విగ్రహానికి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాయన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా పండుగ సాయన్న చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్, ఫౌండేషన్ కోర్సులకు సుమారు 200 మందికి పైగా యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్యకార సంఘాల నాయకులు లేవనెత్తిన స్థలాలు, షెడ్లు, మత్స్యకార సొసైటీల సమస్యలు, చెరువులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములు, రవి, బీసీ సంఘాల ప్రజాప్రతినిధులు శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)