Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Three Aam Aadmi Party (AAP) MLAs in Punjab resigned and joined the BJP ahead of the 2027 assembly elections.
The resignations occurred shortly after AAP announced its first list of 40 candidates.
This development is described as a setback for the ruling party and a boost for the BJP as it prepares for the upcoming polls.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చంఢీఘర్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ , హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా, చేతన్ సింగ్ జౌరమజ్రా సోమవారం (నవంబర్ 2) న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీకి ఈ పరిణామం బూస్ట్ ని ఇవ్వగా.. అధికార ఆప్‌కు మాత్రం భారీ ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
2027 ఫిబ్రవరి, మార్చి నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం ఉండగానే అధికార ఆప్ ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే 40 నియోజకవర్గాలకు ఆప్ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం భగవంత్ మాన్ ధురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)