Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Parachutes collision: గాల్లో విషాదం.. 150 అడుగుల ఎత్తులో పారాచూట్లు ఢీ.. స్కైడైవర్లు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
A parachutes collision during a skydiving event in Lake Elsinore, California resulted in the deaths of two experienced skydivers.
The incident occurred at approximately 150 feet during landing preparations.
SkyDive Elsinore stated that the freefall and parachute deployment were normal and that there was no equipment malfunction.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: కాలిఫోర్నియాలో ఓ స్కై డైవింగ్ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. గాల్లో ఎగురుతున్న సమయంలో పారాచూట్లు ఒకదాంతో మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు స్కైడైవర్లు నేలపై పడి ప్రాణాలు కోల్పోయారు. వీరు స్కై డైవింగ్‌లో సుదీర్ఘ అనుభవంతోపాటు లైసెన్సు ఉన్నవారేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
స్కైడైవింగ్ శిక్షణ, పోటీలకు లేక్ ఎల్సినోర్లోని ‘స్కైడైవ్ ఎల్సినోర్’ సంస్థ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు అనుభవమున్న స్కైడైవర్లు గాల్లోకి ఎగిరారు. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉండగా.. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో పారాచూట్లు ఢీకొని చిక్కుకుపోయాయి. దీంతో ఇద్దరు నేలపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఫ్రీఫాల్, పారాచూట్లు తెరచుకోవడం సాధారణంగానే జరిగిందని, పరికరాల్లోనూ ఎటువంటి లోపం లేదని స్కైడైవ్ ఎల్సినోర్ పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)