Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Parishad elections: ‘పరిషత్’ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రవాసాంధ్రులు
By Eenadu1 min read at Eenadu
In brief
ప్రవాసాంధ్రులు గల్ఫ్ దేశాల్లో ఉంటున్నప్పటికీ, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటు వేశారు.
సౌదీ అరేబియాలో ఉంటున్న రాజశేఖర్ చెన్నుపాటి, జనసేన పార్టీ నాయకులు దుగ్గపు ఎర్రన్న, యాకూబ్ ఖాన్లు తమ హక్కును వినియోగించుకుని, స్థానిక అభ్యర్థులకు మద్దతు తెలిపారు.
చిత్తూరు జిల్లాకు చెందిన వడ్లపట్ల మురళి కూడా తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు వేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కంకిపాడు: పరిషత్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గల్ఫ్ దేశాల్లో ఉంటున్న పలువురు ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. ఉపాధి రీత్యా విదేశాల్లో ఉంటున్నప్పటికీ.. ఓటు వేసి సొంత ఊరి అభివృద్ధి కోసం తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన రాజశేఖర్ చెన్నుపాటి అన్నారు. ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉంటున్నారు. గురువారం తన స్వగ్రామంలో ఓటు వేసిన అనంతరం గల్ఫ్‌లోని ప్రవాసాంధ్రులకు ఒక వీడియో సందేశాన్ని పంపారు.
ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అందుకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ రీత్యా తాము ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేకపోయినా, వీలైన విధంగా అన్ని రకాలుగా కూటమి అభ్యర్థులకు మద్దతిస్తున్నామని సౌదీలో ఉంటున్న జనసేన పార్టీ నాయకులు దుగ్గపు ఎర్రన్న, యాకూబ్ ఖాన్లు వివరించారు. ఒమన్‌లో పని చేసే చిత్తూరు జిల్లా ఐరాల మండలం భీమనేనివారి పల్లి గ్రామానికి చెందిన వడ్లపట్ల మురళి తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)