Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పటాకులు కాల్చొద్దంటూ గొడవ.. రాష్ట్రపతి బాడీగార్డ్ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
A 26-year-old Army jawan, Saurabh Tomar, was shot in the head during a dispute over bursting firecrackers on Diwali night in Gopalkpur Khadana, Baghpat district, Uttar Pradesh.
The altercation occurred with neighbors Dheeraj and Monu, and Tomar was treated at a private hospital in Meerut where the bullet was removed.
The police have registered a case against the accused and are currently searching for them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
లక్నో: దీపావళి పండుగ వేళ పటాకులు కాల్చే విషయంలో తలెత్తిన వివాదం ఓ ఆర్మీ జవాన్‌పై కాల్పులకు దారి తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 26 ఏళ్ల సౌరభ్ తోమర్ ఆర్మీ జవాన్. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు బాగ్పత్ జిల్లాలోని తన సొంత గ్రామం గోపాల్పూర్ ఖదానాకు రెండు రోజుల సెలవుపై వచ్చాడు.
దీపావళి రాత్రి సౌరభ్ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇంటి బయట రోడ్డుపై పటాకులు కాలుస్తున్నాడు. ఈ క్రమంలో పొరుగున ఉండే ధీరజ్, మోనూ బాణా సంచా కాల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ధీరజ్ తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో సౌరభ్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ సౌరభ్ తలలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు సౌరభ్‌ను హుటాహుటిన బరౌత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)