Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పట్టణాలదే పెత్తనం!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడిన ప్రకారం, జనాభా ప్రాతిపదికన శాసనసభ స్థానాలు 119 నుంచి 179కి, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనుండటంతో పట్టణ, అర్బన్ నియోజకవర్గాల ఆధిపత్యం పెరుగబోతున్నదని పేర్కొన్నారు.
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50 శాతం మేర పెంచడంతోపాటు నియోజకవర్గాల పునర్విభజనకు తాజాగా అందుబాటులో ఉన్న జనాభా లెకలను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించారని నివేదించారు.
2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది ఆటంకంగా మారిందని, కొత్తగా 179 స్థానాలు ఏర్పడితే వాటిలో సుమారు 60 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయని వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనున్నది. జనాభా ప్రాతిపదికన శాసనసభ స్థానాలు 119 నుంచి 179కి, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనుండటంతో పట్టణ, అర్బన్ నియోజకవర్గాల ఆధిపత్యం పెరుగబోతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లూ గ్రామీణ ప్రాంత ఓటర్లు నిర్ణాయకక శక్తిగా ఉండగా, ఇకపై పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకొన్న వారికే అధికార పీఠం చేరువ అవుతుందని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో గడిచిన దశాబ్దకాలంలో వేగంగా పెరిగిన పట్టణీకరణ, వలసల ప్రవాహం, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను శాసించే ప్రధాన శక్తులుగా అవతరించనున్నాయని విశ్లేషిస్తున్నారు. దీనికితోడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుతో పెనుమార్పులు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. 2027లో జనగణన జరుగనున్న నేపథ్యంలో కొత్త జనాభా లెకల ఆధారంగానే డీలిమిటేషన్ చేపడుతారని ఇంతకాలం భావించారు. మహిళా రిజర్వేషన్ చట్టం-2023లోనూ తదుపరి జనగణన అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనతో రిజర్వేషన్ల అమలును ముడిపెట్టారు. అయితే 2027 జనగణన ప్రక్రియ పూర్తవడం, గణాంకాల ప్రచురణ, వాటి ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)