Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
The article reports that the Andhra Pradesh government has operated the Pattiseema lift irrigation scheme for 100 days to divert 65 TMC of Godavari river water to the Krishna delta, despite a 29% rainfall deficit.
It contrasts this with the Telangana government's decision to declare a crop holiday in the SRSP command area, alleging that the state failed to utilize available floodwaters from the Manjeera and Godavari rivers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Pattiseema | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : పొరుగున ఏపీలో 29-33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయినా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అక్కడ క్రాప్ హాలిడే ముచ్చటే లేదు. గోదావరి ఆయకట్టుకు ఢోకా లేదు. కారణమేందంటే ప్రాణహిత నుంచి వచ్చిన వరద జలాలను ఏపీ ఒడిసిపట్టడమే! పట్టిసీమ లిఫ్ట్ ద్వారా మళ్లించడమే! ఏకధాటిగా 100 రోజులుగా పంపులు నడిపి ఇప్పటికే 65 టీఎంసీలను కేవలం పట్టిసీమ ద్వారానే మళ్లించింది. తెలంగాణలో కరువును అధిగమించే పరిస్థితులే ఉన్నాయి. రాష్ట్రంలో లోటు వర్షపాతం 18-24 శాతానికి మించలేదు. ప్రాణహిత నుంచి మేడిగడ్డ ద్వారా 750 టీఎంసీలు దిగువకు తరలిపోయాయి.
అయినా ఎస్సారెస్పీ ఆయకట్టుకు కూడా ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించింది. ఇదీ రేవంత్ సర్కార్ పనితీరు. కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి ఉంటే ఎస్సారెస్పీతోపాటు సగానికిపైగా తెలంగాణ ప్రాంతాన్ని కరువు నుంచి కాపాడుకొనే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా దిగువకు వదిలిపెడుతూ రాష్ర్టాన్ని తీసుకెళ్లింది. మరోవైపు దిగువన ఏపీ పట్టిసీమ, తాడిపూడి లిఫ్ట్‌లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోసుకున్నది. కృష్ణా డెల్టాకు సైతం గోదావరి జలాలను మళ్లిస్తున్నది. మొత్తంగా ఏపీ కోసమే రేవంత్ సర్కార్ కన్నెపల్లి పంపులను ఆన్ చేయడం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)